37.2 C
Hyderabad
April 19, 2024 13: 01 PM
Slider హైదరాబాద్

కవన మంజరి కవితా సంపుటి ఆవిష్కరణ

#manjulasurya

కవిత్వం చిన్నారి పాపలాంటిది. కవి తన ప్రేమతో కవిత్వాన్ని లాలించగలగాలి. పాలించగలగాలి. ఒక్కొసారి బ్రతిమాలి అనువుగా మలచుకోవాలి. ఇలా ఎన్ని చేసినా ప్రేమను మాత్రం అన్నింటికీ కామన్ గా కొనసాగించినప్పుడే కవిత్వం కవి వశం అవుతుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.

హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజా, హైదరాబాద్ ప్రచురించిన యువ కవయిత్రి మంజుల సూర్య ‘కవన మంజరి’ని నేడు ఆయన రవీంద్రభారతి ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజుల సూర్య లాంటి యువ కవయిత్రులే  ఈనాటి సమాజానికి ఎంతో ముఖ్యం అన్నారు. ఒద్దికగా కూర్చున్న కవిత్వాన్ని మన ముందు ‘కవన మంజరి’గా ఆవిష్కరించిన కవయిత్రి మంజుల సూర్యకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అభినందనలు తెలిపారు.

మరెన్నో ఉపయుక్తమైన కవితలు రాసి సమాజాన్ని జాగృత పరిచే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

‘కవన మంజరి’ ని ఆవిష్కరించి తొలి ప్రతిని హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సెక్రటరీ కొరుప్రోలు హరనాథ్ కు అందచేశారు.

ఇంకా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సత్యం న్యూస్. నెట్  ఛీఫ్ ఎడిటర్ సత్యమూర్తి పులిపాక,  రాంఖీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నఅధికారులు

Satyam NEWS

సత్యవేడు సమీపంలో 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam July 7, 2021 at 3:40 AM

Congratulations
అభినందనలు

Reply

Leave a Comment