28.7 C
Hyderabad
April 20, 2024 04: 26 AM
Slider ప్రకాశం

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

anto curruption

అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయని ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాపాటి నాగేశ్వర రావు అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  ఏపీ ప్రజా సంక్షేమ సమితి కార్యాలయం లో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి కారణంగా పేదరికం పెరిగిపోతున్నదని, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగి పోయాయని  తెలిపారు. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రతి ఒక్కరు  పాలుపంచుకోని అవినీతీని అంతం చేయాలనీ కోరారు.

ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నంబరు కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్‌ చార్టర్‌లు ప్రదర్శించి వీటిని సక్రమంగా అమలు జరిగేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు.

అవినీతి నిర్ములన కోసం సమాచార హక్కు  చట్టాన్ని పూర్తిగా  ప్రజలు తెలుసుకునే విధంగా  ప్రచారం చేయాలని , ప్రతీఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రేమల కరుణాకర్, నాయకులు సాపాటి నాగేశ్వర రావు,  తన్నీరు వెంకటేశ్వర్లు , కోటయ్య ,రవి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శనగ రైతును సొసైటీ ఆదుకోవాలి

Satyam NEWS

పారిశుద్ద్య కార్మికులకు మంత్రి అల్లోల‌ సలాం

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాములు నాయ‌క్ గెలుపు ఖాయం

Satyam NEWS

Leave a Comment