28.7 C
Hyderabad
April 20, 2024 09: 04 AM
Slider మహబూబ్ నగర్

నూతన విభాగంతో  మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట

#WanaparthyPolice

మానవ అక్రమ రవాణా , పిల్లలను నిర్బంధించడం, వారిని  వ్యభిచారంలోకి దింపడం, వారితో  బిచ్చమెతించడం,  శ్రమ దోపిడీ చేయించడం,  సామూహిక అత్యాచారం, మహిళలు, పిల్లలను, లొంగదీసుకోవడం,మైనర్లను అమ్మడం , కొనుగోలు చేయడం ద్వారా  వాణిజ్య లైంగిక దోపిడీ చేయడం మొదలైవి  నివారణకు పోలీసుశాఖ వనపర్తి  జిల్లాలో సీసీఎస్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసు,  నోడల్ అధికారిగా ఏర్పాటు చేశారు.

ఆయనతో పాటు పోలీసు సిబ్బంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ శాఖ, లేబర్ శాఖ , DCPO, CDPO, చైల్డ్ హెల్ప్ లైన్, డిస్ట్రిక్ట్ ప్రోబిషనరి అధికారి, పబ్లిక్ ప్రాసికూటర్,హెల్త్, లీగల్ ఎక్స్పర్ట్ , CWC, NGOs అధికారులు సభ్యులుగా ఉండే విధంగా Anti Human Trafficking Unit ను  ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  తెలిపారు.

మంగళవారం  జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా  ఎస్పీ, RDO, DCPO , CDPO, CWC, చైల్డ్ హెల్ప్ లైన్, సఖి సెంటర్, హెల్త్, వెల్ఫేర్,లేబర్, రెవెన్యూ,లీగల్ సలహాదారు మరియు NGOs అధికారులతో   Anti Human Trafficking Unit ఏర్పాటు చేసిన సందర్భంగా  సమావేశం  ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశం లో  ఎస్పీ మాట్లాడుతూ. సమాజంలో  18 సంవత్సరాలలోపు బాలబాలికలు వారి అనుమతితో గాని అనుమతి లేకుండా గాని  శ్రమ దోపిడీకి గురికావడం, వారిని నిర్బంధం చేయడం, మహిళలను పిల్లలను లొంగదీసుకోవడం , వారిని అమ్మడం కొనడం ద్వారా వాణిజ్య లైంగిక దోపిడీ జరిగే అవకాశం ఉన్నప్పుడు సమాచారం సేకరించడం, ముందస్తు నివారణకు అవగాహన కల్పించడం, పోలీస్ వారికి సమాచారం అందించడం, బాధితులకు న్యాయం చేయడం తదితర అంశాలపై AHTU కమిటీ సభ్యులతో  చర్చించారు.

Anti Human Trafficking Unit

ఈ సందర్భంగా ఎస్పీ AHTU  యొక్క లక్ష్యాలు సబ్యులకు తెలియజేస్తూ మానవ అక్రమ రవాణాను  నేర కోణంతో  వ్యవహరించాలని , బహుళ-క్రమశిక్షణా విధానాన్ని అవలంబించాలని తెలిపారు. సభ్యులందరు   ఉమ్మడి ప్రతిస్పందనతో  నిర్దారణకు రావాలని, మానవ అక్రమ రవాణాకు సంబందించిన నేరం జరిగినట్లు   పోలీసు శాఖ నుండి లేదా ఎన్జిఓఎస్ లేదా పౌర సమాజం నుండి గాని అక్రమ రవాణా కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్నప్పుడల్లా ఎన్జిఓఎస్, ఉమెన్ & చైల్డ్ డిపార్ట్మెంట్ , కార్మిక సంక్షేమ శాఖ సహాయంతో సహాయక చర్యలను అందించాలని అన్నారు.   

అక్రమ రవాణా కోణం నుండి కేసుల నమోదు నిర్దారణ అయినప్పుడు బాధితులకు మొదటి నుండి  కేసు  ముగిసే వరకు “బాధితులకు సాక్షుల  మద్దతు” అందించాలని. ప్రాసిక్యూషన్ దృక్పథం నుండి ఇతర సాక్ష్యాధారాలను సేకరించడం,కోర్ట్ విచారణ కోసం బాధితులను సమాయత్తం చేయడం, వారికి   మార్గనిర్దేశం చేయడం వంటి సహకారాలు అందించాలని అన్నారు. జిల్లాలో మానవ అక్రమ రవాణా ను నిరోధించడానికి పోలీసు శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయం అవసరమని అన్నారు.మహిళలను చిన్నపిల్లలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

వనపర్తి జిల్లాలో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టి, నేర రహిత జిల్లాగా చేయడంలో భాగంగానే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున అన్ని శాఖల అధికారులు జిల్లాలో మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

మానవ అక్రమ రవాణ సంబందించి వనపర్తి జిల్లాలో ఏ ములాలో కనబడిన 100 నంబర్ కు గాని 1098 మరియు 181  నెంబర్ కు గాని, whats app నెంబర్ 63039 23211 కు గాని, ఏ హెచ్‌టి‌యూ నోడల్ అధికారి ఇన్స్పెక్టర్ 7901100542 నెంబర్ కు గాని   సమాచారం ఇవ్వాలని కోరారు.వనపర్తి జిల్లాలో హుమెన్ ట్రాఫికింగ్ రూపు మాపడంలో ప్రతి యొక్క డిపార్ట్మెంట్ వారు కృషి చేయాలని, ఇలాంటి నీచమైన మానవ అక్రమ రవాణా ను అరికట్టడంలో ప్రతి పౌరుడు  పాల్గొని పసి మొగ్గలను కాపాడి వారికి ఉన్నతమైన జీవితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి ఆర్డీఓ,అమరెందర్, డి.‌డబల్యూ.‌ఓ అధికారి పుష్పలత, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్,అశోక్ రావు, ఏహెచ్‌టి‌యూ జిల్లా స్పెషల్ పోలీసు ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ,శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్  జమ్ములప్ప, వనపర్తి సీఐ సూర్య నాయక్, కొత్తకోట సీఐ, మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సిఐ,సీతయ్య, సిడబ్ల్యూసి చైర్పర్సన్ అలివేలమ్మ, మెడికల్ డిపార్ట్మెంట్, ఇస్మాయిల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, సురేందర్, ఐ సి డి ఎస్ అధికారి అరుణ, సఖి , గిరిజ , సీడబ్ల్యూసీ అధికారి  వనజ కుమారి, రూరల్ డెవలప్మెంట్ అధికారి తోమాస్, ఉజ్వల  హోమ్,  విజయలక్ష్మి, లేబర్ అధికారి, రఫీ, పిఆర్వో. రాజగౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బదరీనాథ్ విశిష్టత: పిండ ప్రదానాలకు బ్రహ్మకపాలం సిద్ధం

Satyam NEWS

వనపర్తి, పెబ్బేరులో దేవాలయం భూములు స్వాధీనం:ఎమ్మెల్యే మేఘా

Satyam NEWS

బలహీన వర్గాల మహిళలపై పెరిగిన అత్యాచారాలు

Satyam NEWS

Leave a Comment