39.2 C
Hyderabad
April 23, 2024 16: 36 PM
Slider శ్రీకాకుళం

ఉద్యమనేత నండూరి బాటన మనమంతా నడవాలి

#CITUSrikakulam

కార్మికోద్యమ నేత నండూరి ప్రసాదరావు ఆశయసాధనకు కృషి చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు పిలుపునిచ్చారు. నండూరి ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.సురేష్ బాబు, పి.తేజేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అలుగొలను గ్రామంలో పుట్టిన ప్రసాదరావు సామాన్య రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన అసాధారణ నేత అని అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ,హక్కుల కోసం కార్మికవర్గ ఐక్య పోరాటాలను ప్రోత్సహించిన నండూరి అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఉపాద్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వ్యవస్థాపక CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఎందరికో స్ఫూర్తిని కలిగించారని తెలిపారు.

1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ప్రసాదరావు గారు రైతులు, వ్యవసాయ కార్మికులతో కలిసి పనిచేశారని తెలిపారు. సిపిఎంలో కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశారని, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చకు పెట్టి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు.

కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వం

ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన వివిధ రైతు పోరాటాలకు, కార్మిక పోరాటాలకు నండూరి సారధ్యం వహించారని అన్నారు. తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్ లజు అనుకూలంగా మోడి ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లుగా మార్చివేసిందని అన్నారు.

బిజెపికి బలం లేకపోయినా అప్రజాస్వామికంగా మూడు రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఆమోదించుకుందని రైతాంగం గోడు పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని నిరసన తెలపడానికి అన్నదాతలు లక్షలాది మంది దేశ రాజధాని ఢిల్లీకి తరలివస్తే మోడి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిందని విమర్శించారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, హక్కులు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ నాయకులు బి.శ్యామసుందరరావు, పి.రాంబాబు,ఎల్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ లో వరద నివారణకు మాన్సూన్ ఏమర్జెన్సీ బృందాలు

Satyam NEWS

ఊ(ఓ)ర్మిళ

Satyam NEWS

మరో భారీ బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Satyam NEWS

Leave a Comment