27.7 C
Hyderabad
April 20, 2024 00: 35 AM
Slider ప్రత్యేకం

ఆంత్రిక్ సురక్ష సేవ పతకం అందుకున్న ములుగు ఎస్.పి

#prashanthgpatil

తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు, అంతర్గత భద్రత కార్యకలాపాలు సమర్ధంగా నిర్వహించిన ములుగు జిల్లా పోలీసు అధిపతి డా.సంగ్రాంసింగ్ జి. పాటిల్ ఆంత్రిక్ సురక్ష సేవ పతకం అందుకున్నారు. కల్లోలిత ప్రాంతాలలో కనీసం రెండు సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డు ఇస్తారు.

అదే విధంగా మిలిటెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించిన వారు ఈ పతకానికి అర్హులు. ఇందులో భాగంగా వామపక్ష తీవ్రవాద ప్రాంతంలో భాగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం లో ని ములుగు జిల్లా కు చెందిన 13 మందికి ఈ అవార్డు దక్కాయి. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రం గా ఉన్న ములుగు జిల్లా ను శాంతియుత  జిల్లా గా, అభివృద్ధి చెందుతున్న జిల్లా గా మార్పుచేసుకోవడానికి వీలుగా శాంతి భద్రతలు నెలకొల్పిన జిల్లా ఎస్ పి ఉత్తమ సేవలకు ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.

జిల్లా ఎస్పీ తో సహా అవార్డులు అందుకున్న వారు

1. డా. సంగ్రాంసింగ్ జి. పాటిల్  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ –ములుగు

2. సట్ల కిరణ్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్ డిస్టిక్

3.G. తిరుపతి -సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్- వరంగల్

4. కె తిరుపతిరావు -ఎస్ఐ ఆఫ్ పోలీస్ -భద్రాద్రి, కొత్తగూడెం

5. సి.హెచ్ వెంకటేశ్వరరావు -ఎస్ఐ ఆఫ్ పోలీస్- తాడ్వాయి పోలీస్ స్టేషన్ -ములుగు

6. సయ్యద్ ముస్తఫా ఏ ఆర్ హెచ్ సి 2037/ 437 — బాంబ్ డిస్పోజల్ టీం- ములుగు

7. ఎం. రాజేష్ ఏ.ఆర్.హెచ్. సి 496/446 బాంబ్ డిస్పోజల్ టీం  ములుగు

8. కె వెంకటేశ్వర్ రావు PC 360 వాజీడు పోలీస్ స్టేషన్ ములుగు

9. S.  బిక్షపతి PC 1273/456 డిస్ట్రిక్ట్ గార్డ్ ములుగు అటాచ్డ్ టు థర్డ్ వాయి పోలీస్ స్టేషన్ ములుగు

10. V కిరణ్ PC 84/522 డిస్ట్రిక్ట్ గార్డ్ అటాచ్డ్ టు కొడిశాల పోలీస్ స్టేషన్- ములుగు

11. ఈ.  సుధాకర్ ARPC 4096/486 బాంబ్ డిస్పోజల్ టీం అటాచ్డ్ టు ములుగు

12. L. అనిల్  ARPC 2894/33 స్పెషల్ పార్టీ ములుగు

13. పి. ప్రేమ్ సాగర్ PC 2705/05 డిస్టిక్ గార్డ్ ములుగు అటాచ్డ్ టు కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ ములుగు

ములుగు జిల్లా ఎస్పీ డా.సంగ్రాంసింగ్ జి. పాటిల్ ఆంత్రిక్ సురక్ష సేవ పథకంలో భాగంగా అవార్డు అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ఏపి ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం

Satyam NEWS

Viral video  : గల్వాన్ లోయలో భారత సైనికుల క్రికెట్

Satyam NEWS

అవినాష్ రెడ్డి  అరెస్టుకు తొలగిన అడ్డంకులు

Satyam NEWS

Leave a Comment