28.2 C
Hyderabad
April 20, 2024 10: 56 AM
Slider వరంగల్

పేద పిల్లలకు సాయం చేసేందుకు అనురాగ్ సిద్ధం

#anuraghelpingsiciety

పేదరికం విద్యకు ఎటువంటి ఆటంకం కారాదని అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా॥కె.అనితారెడ్డి అన్నారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో నేడు హన్మకొండ శాయఁపేట ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పన్నెండు వందల లాంగ్ నోట్ బుక్స్, పెన్నులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డా||కె.అనితారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలు అత్యంత పేదరికంతో ఉన్నారని పుస్తకాలు అందజేయాలని ప్రిన్సిపాల్ కోరగా తక్షణం అందించామని అన్నారు.

చదువుకోవాలనే పట్టుదల, క్రమశిక్షణ ఉన్న పిల్లలకు చేయూతనీయడానికి తాము ఎప్పుడు సిద్ధం అని అనితారెడ్డి అన్నారు. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని, విద్య జీవితంలో ఉన్నత స్థానానికి చేరడానికి వారధి అని అన్నారు. పిల్లలకి చిన్నతనం నుండి చదువుతోపాటు, సంస్కారం, మంచి నడవడిక నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  కె.రాంరెడ్డి, రవికిరణ్, ఎం.స్వామి, టీచర్స్, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

ఓజో పౌండేషన్ ద్వారా పాఠశాలకు మరమత్తులు

Satyam NEWS

ఒకే గొంతుకతో జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీలు

Satyam NEWS

ఉపాధి పనుల్లో మరింత వేగం పెంచండి

Satyam NEWS

Leave a Comment