28.7 C
Hyderabad
April 25, 2024 04: 33 AM
Slider వరంగల్

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆత్మీయ స్పర్శ – ఆటవిడుపు

#anuraghealpingsocity

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ , మాజీ CWC చైర్ పర్సన్  డా||కె.అనితారెడ్డి వరంగల్ లోని లూయి ఆదర్శ అంధుల పాఠశాలలో “ఆత్మీయ స్పర్శ – ఆటవిడుపు” కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా డా|| కె.అనితారెడ్డి అంధుల పాఠశాలను సందర్శించి పిల్లల మంచి చెడులు అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల కేర్ అండ్ ప్రొటక్షన్లో ఏమైన ఇబ్బందులు ఉంటే తెలియచేయమని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

పిల్లలకు అమ్మలా కబుర్లు చెప్పడం జరిగింది. ఒక ఆట విడుపు కార్యక్రమంలో పిల్లలు పాటలు పాడి వినిపించారు. క్విజ్, గేమ్స్ తో అలరించారు. అనంతరం పిల్లలకు స్నాక్స్, పండ్లు, స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్ అందించి పిల్లలతో ఆనందంగా గడపడం జరిగింది. ఈ సందర్భంగా డా|| అనితారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగాల సేవ విశ్వమానవ సేవ అని ముఖ్యంగా అంధులైన పిల్లలకు వారికి ఇష్టమైనవి ఏర్పాటు చేయడంలో కలిగే సంతృప్తి, ఆనందం మరెందులో ఉండదని, ఓ అమ్మలా ప్రేమను, ఆత్మీయ స్పర్శను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందని, ఆటవిడుపు పిల్లలకు మరింత ఉత్సాహం, ఉల్లాసం కలిగించి తమకు అందరూ ఉన్నారన్న భరోసా, సంతోషం కలిగిస్తుందని అనితారెడ్డి అన్నారు.

Related posts

ఎం.పి.పి అరెస్ట్: పోలీస్ స్టేషన్ కు తరలింపు

Satyam NEWS

ఎమ్మెల్యే ఈటలను పరామర్శించిన బండి సంజయ్

Satyam NEWS

‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

Satyam NEWS

Leave a Comment