39.2 C
Hyderabad
April 25, 2024 15: 46 PM
Slider ప్రత్యేకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ అరెస్ట్…!

#bandisainjai

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలకై తన ఇంటి వద్దే జన జాగరణ ఉద్యమం చేపట్టారు. అయితే ప్రభుత్వం ఈ జాగరణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన దాదాపు  25 మంది  పోలీసులను దించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను లాక్కెళుతున బీజేపీ కార్యకర్తల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, జర్నలిస్టులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. బండి సంజయ్ కుమార్.

ప్రజాస్వామ్యబద్దంగా ‘జాగరణ’ చేస్తుంటే ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? : బండి సంజయ్ కుమార్ అరోపించారు.

కేసీఆర్…. బీజేపీతో పెట్టుకున్నావ్….. నీకు నరకం చూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నయిని… ప్రజాస్వామిక గొంతులపై భౌతిక దాడులు చేస్తూ ఈడ్చుకుంటూ తీసుకెళతావా? అంటూ ధ్వజమెత్తారు.    

కేసీఆర్… ఇంతకింత అనుభవిస్తావ్? ఉద్యోగుల, ఉపాధ్యాయుల, జర్నలిస్టుల, కార్యకర్తల ఉసురు తగలక తప్పదన్నారు… పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.అలాగే కేసీఆర్…  నిన్ను కూడా జైలుకు ఈడ్చుకెళ్లే రోజులు రాబోతున్నయని బండి సంజయ్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ తోపాటు బీజేపీ రాష్ట్ర నేతలు లు టి.వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్ లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.పోలీస్ కమిషనర్ కు డాక్టర్ లక్ష్మణ్ ఫోన్ చేసినా స్పందించిన కమీషనర్ సత్యనారాయణ. దీంతో పోలీసుల తీరును ఖండించారు…ఓబీసీ అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్.

బండి సంజయ్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.. పోలీసులు

ఏ క్షణం లో అయినా పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ని అరెస్ట్ చేసే చాన్స్ ఉంది.ఇక ఎంపీ క్యాంపు కార్యాలయ గేట్లు బద్దలు కొట్టేందుకు పోలీసుల యత్నించారు.అడ్డుకుంటున్న కార్యకర్తలను లాక్కెళ్లారు.. పోలీసులు.మహిళా కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు.. మగ పోలీసులు.అదుపులోకి తీసుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.. పోలీసులు.

పోలీసుల దాడితో పలువురు కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర  గాయాలపాలయ్యారు. అలాగే పోలీసు దెబ్బలకు కాలు విరిగి  అల్లాడుతున్న ఓబీసీ  మోర్చా నాయకుడు మంతెన కిరణ్.. గాయపడ్డ కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరినీ తక్షణమే ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని బండి  సంజయ్ డిమాండ్ చేసారు. అదే విధంగా కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Related posts

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‎కు షాక్..

Sub Editor

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

Satyam NEWS

ఫారెస్ట్ ఆఫీసర్ బైక్ దగ్ధం

Bhavani

Leave a Comment