28.2 C
Hyderabad
April 20, 2024 12: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్లతో రాజకీయాలు

kishan

తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు ఫేక్ అకౌంట్లతో కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని ఏపీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలుగు 360 website- ట్విట్టర్ అకౌంట్,  టేక్ వన్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై రాజకీయ కక్షతో రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు పెడుతున్నారని దీన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలో తన పై ఇతర కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న కథనాలకు సంబంధించి మార్ఫింగ్ చేసిన ఫోటోలను  వైరల్ చేస్తన్న కథనాలపై ఆయన ఢిల్లీ పోలీస్ కమీసనర్ కు మరో ప్రత్యేక ఫిర్యాదు అందచేశారు. ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పై ఏపీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి  పేరుతో నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి  నెహ్రూ యువ సంఘటన వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. అందువల్ల యువజన క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎ.కే.అమిత్ ఝా కూడా విష్ణువర్ధన్ రెడ్డి పై వివాదాస్పద పోస్టులు పెడుతున్న వారిపై ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు చేశారు.

Related posts

జాతీయ ఫెన్సింగ్ పోటీలకి శర్వాణీ విద్యార్ధి ప్రణయ్

Satyam NEWS

జీవీఆర్ కరాటే అకాడమీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

కందకు లేని దురద ఈ కత్తిపీటకు ఎందుకు?

Satyam NEWS

Leave a Comment