32.2 C
Hyderabad
March 28, 2024 22: 53 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఉపరాష్ట్రపతిపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఏపి సిఎం జగన్

kanna-laxminarayana

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గురించి ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్యనాయుడు పాత్ర ఎనలేనిదని, మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే ఉపరాష్ట్రపతి సూచించారని అయినా సిఎం దారుణమైన వ్యాఖ్యలు చేయడం శోచనీయమని లక్ష్మీనారాయణ అన్నారు. గతంలో టిడిపి హయాంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు సమయంలో జగన్ తీవ్రంగా విమర్శించారని, అప్పుడు ఇంగ్లీషు మీడియం వద్దని.. ఇపుడు ఎలా ప్రవేశపెడతారు అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. నిర్బంధంంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో ఏళ్లు పోరాడి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్నాం. తన తండ్రి వైయస్ హయాంలోనే ప్రాచీన హోదా వచ్చిన విషయం జగన్ గుర్తించుకోవాలి. మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు… మాతృభాషలో భోదన కూడా ఉండాలనేది మా డిమాండ్ అని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్సులు అడపా శివనాగేంద్రరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండవరపు జగన్, పాలిశెట్టి రఘు, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎయిడ్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

Satyam NEWS

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్ర‌తీక కెవీ రంగారెడ్డి

Sub Editor

కరీంనగర్ లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం

Satyam NEWS

Leave a Comment