30.7 C
Hyderabad
April 24, 2024 01: 44 AM
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇంకో రాజాసింగ్ కావాలి

#RajasinghMLA

కుల రాజకీయాల కోసం మతానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ బిజెపికి రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరమని కింది స్థాయి బిజెపి నాయకులు కోరుకుంటున్నారు. దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు పోరాటాలకు సిద్ధం కావడం లేదు.

అక్కడక్కడ ధర్నాలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి వత్తిడి కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బిజెపి నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్నా ప్రతిఘటించే రాష్ట్ర స్థాయి నాయకులు కరవయ్యారు. కే

వలం కులం ప్రాతిపదికన రాజకీయాలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్న ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు పార్టీ ఎదిగేందుకు అందివచ్చిన అవకాశాన్ని కాలరాసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులు చేస్తున్న అరాచకాలపై పోరాటానికి తెలంగాణ కు చెందిన బిజెపి ఎమ్మెల్యే టి.రాజాసింగ్ సిద్ధపడిన విషయం తెలిసిందే.

తాను స్వయంగా వచ్చి శ్రీశైలం దేవస్థానం వద్ద నిరసన తెలుపుతానని రాజా సింగ్ హెచ్చరించడంతో 9 మంది అన్యమతస్థులైన ఉద్యోగులపై దేవస్థానం చర్యలు తీసుకున్నది. అన్య మతస్థుల ఆధీనంలో ఉన్న షాపులపై విచారణ మొదలు పెట్టి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

శ్రీశైలం దేవస్థానంలో అధికారం చెలాయిస్తున్న రజాక్ అనే వ్యక్తి భార్య ఆధీనంలో ఉన్న గోశాల బాధ్యతలను ఆమె నుంచి తప్పించారు. తెలంగాణ లోని ఘోషామహల్ బిజెపికి చెందిన నాయకుడు రాజా సింగ్ ఒక్క పిలుపుతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకోగా ఆంధ్రాలో వందల సంఖ్యలో దేవుడి విగ్రహాలు విరగ్గొడుతున్నా అక్కడి బిజెపి నాయకులు అవసరమైన పోరాటం చేయడం లేదు.

రాముడి తల నరికినా నామమాత్రపు స్పందనేనా?

ఇదే అభిప్రాయం కింది స్థాయి బిజెపి కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయింది. రాముడి తల నరికితే కూడా నామమాత్రపు నిరసన తెలిపిన బిజెపి నాయకులు ఏం ఆశించి అలా చేస్తున్నారో కింది స్థాయి కార్యకర్తలకు అర్ధం కావడం లేదు. హిందూ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.

విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి తలనరికిన సంఘటనపై రాష్ట్రం మొత్తం ఆందోళన చేయాల్సిన బిజెపి నామమాత్రంగా స్పందించడంతో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి.

అందుకే ఆంధ్రప్రదేశ్ బిజెపికి కుల రాజకీయాలు చేసే నాయకులు కాకుండా హిందూ ధర్మం కోసం పాటు పడే రాజాసింగ్ లాంటి నాయకులు కావాలని బిజెపి కింది స్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Related posts

చెరుకు సుధాకర్ ని శాసన మండలికి పంపుదాం

Satyam NEWS

ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెంటనే చేపట్టండి

Bhavani

రేవూరు గ్రామంలో ఘనంగా శ్రీ గోదాదేవి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment