ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అన్ని రోడ్లను మూసివేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. నిన్నటి రాత్రి నుండి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల వాహనాలను ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతించడం లేదని ఆయన తెలిపారు.
అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అన్ని వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాల కు మాత్రమే రాష్ట్రంలో అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. బోర్డర్ల మూసివేత కారణంగా ప్రజలు ఎవరు రాకపోకలు కొనసాగించేందుకు ప్రయత్నించవద్దని ఆయన కోరారు.