36.2 C
Hyderabad
April 25, 2024 21: 48 PM
Slider ముఖ్యంశాలు

5 వ తేదీ నుంచీ 18 గంటల పాటు కర్ఫ్యూ: ఏపీ కేబినెట్ ఆమోదం

#perninani

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ..పగటి పూట కూడా కర్ఫ్యూ విధించనుంది..జగన్ ప్రభుత్వం. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే అన్నింటికీ ఆమోదం తెలిపింది.

ఆదే సమయంలో మాత్రమే ఆర్టీసీ బస్సులు కూడా నడపాలని అనంతరం బస్సులు డిపోలకే పరిమితము కావాలని పేర్కొంది.కరోనా కట్టడి కోసం ఈ నెల 5 మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పగటి పూట కర్ఫ్యూ సహా పలు అంశాలను చర్చించారు.ఈ నెల 5 నుంచీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.ఇక12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేయనున్న ట్టు మంత్రి నాని తెలిపారు.

ఇక మిగిలిన కేబినెట్ నిర్ణయాల గురించి చెబుతూ పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది అన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.

నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి 1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. 2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Related posts

నార్కో పరీక్షలను తిరస్కరించిన ఉమాశంకర్ రెడ్డి

Satyam NEWS

ఇంటర్ నెట్ షట్ డౌన్ లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్

Satyam NEWS

ములుగు జిల్లాలో తొలిమెట్టు పై సమీక్ష

Bhavani

Leave a Comment