తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందచేశారు. ఈనెల 28 వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలకు సకుటుంబంగా హాజరుకావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. జగన్ మోహన్ రెడ్డి వెంట టీటీడీ పాలకమండలి చైర్మన్ సుబ్బారెడ్డి ఇతర సభ్యులు కూడా ప్రగతి భవన్ కు వెళ్లారు
previous post
next post