ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం పులివెందుల లోని రోడ్లు, భవనాల అతిధి గృహంలో అందించారు. ఇందులో పెద్దకడప కు చెందిన ఎస్.నుస్రత్ బేగం కు రూ.2 లక్షలు, కడప కు చెందిన కే.రామయ్య కు రూ.2 లక్షలు, చెన్నూరు మండలం రాచినాయపల్లి హరిజనవాడకు చెందిన కటారి లక్ష్మీదేవి కి రూ.2 లక్షలు, చక్రాయపేట మండలం కల్లూరుపల్లి వాసి ఇ. మల్లే నాయక్ కు రూ.2 లక్షలు, పులివెందుల, ఆర్.తుమ్మలపల్లి కు చెందిన టి.అనసూయకు రూ.2 లక్షలు, పులివెందులకు చెందిన ఎస్.మహబూబ్ బీ కు రూ.5 లక్షలు, సింహాద్రిపురం మండలం, పైడిపాలెం వాసి పి.సుభద్రమ్మకు రూ.2 లక్షలు, తొండూరు మండలం, బాచుపల్లె గ్రామ వాసి పి.వెంకటరమణ కు రూ.2 లక్షలు, రాచమర్రి పల్లి గ్రామ వాసి జె. కళావతి కు రూ.1 లక్ష మొత్తం తొమ్మిది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.20 లక్షల విలువైన సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను ముఖ్యమంత్రి అందించారు. అదేవిధంగా న్యూజిల్యాండ్ లో జరిగిన వరల్డ్ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ -2019 లో కడపకు చెందిన ఆర్. కె.సిద్దార్థ రెడ్డి ( 17 సం. లు) , పి.వి. సాయి శ్రీనివాస్ ( 9 సం. లు) లు గోల్డ్ మెడల్స్ సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. క్రీడలలో మరిన్ని పథకాలు సాధించి దేశం, రాష్ట్రం, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, జిల్లా ఇంచార్జి , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ గడి కోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మొహంతి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post