21.2 C
Hyderabad
December 11, 2024 21: 07 PM
Slider ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు అద్దంలా ఉండాలి:వై ఎస్ జగన్

y s jagan america

రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నేడు సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని పరిశీలించాలని, ఉన్నతాధికారులు తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి, స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచాలు, బ్లాంకెట్స్‌ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండాలి, మూడు దశల్లో ఈ పనులు పూర్తికావాలి అని సిఎం అన్నారు. మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి అని సీఎం  అన్నారు. డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల  కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశం ఇచ్చారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్‌మన్‌ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సిఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలని ఆయన అన్నారు.

Related posts

టికెట్ కోసం దరఖాస్తు చేసుకోని సీనియర్లు

Bhavani

నైనీ త‌వ్వ‌కాల‌కు తొల‌గిన అడ్డంకులు

Satyam NEWS

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

Satyam NEWS

Leave a Comment