దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని కూడా ఆయన ఆదేశించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని ఆయన సూచించారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని, ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
previous post