ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇవో సురేష్ బాబు అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రిక ను అందజేశారు. దుర్గమ్మ ఆలయ ఈవో సురేష్ బాబు తో బాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అర్చక స్వాములు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు