తమ జీవితాల్లో మార్పు రావాలని బలంగా కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఎన్నుకున్నారని, వారి ఆశలు తీర్చడమే తన జీవిత ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రసిద్ధ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పై ఛాయాచిత్రాలకు వ్యాఖ్యా సహితంగా పుస్తకాన్ని రూపొందించారు. ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రఖ్యాత పాత్రికేయుడు శేఖర్ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు లో జరిగిన ఈ సభలో వై ఎస్ జగన్ మాట్లాడుతూ తనపై ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము కాకుండా చూస్తానని అందుకోసమే ఎంత శ్రమ అయినా పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు మాశర్మ కూడా పాల్గొన్నారు.
previous post
next post