అందరి సహకారం తీసుకొని, సమిష్టిగా ఒకేమాటగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై ఈ పార్లమెంట్ సమావేశాలలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారని ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం అవసరమని ఆయన అన్నారు. విభజన హామీలలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలుచేయలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులలో కోత విధించింది. 2014-15 లోటు బడ్జెట్ నిధులు కేంద్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తక్షణమే అమరావతిలోగాని, ఢిల్లీలో గానీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయండి అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని వైసీపీ ఎంపీలకు మీరు చెప్పడం అభినందనీయం హర్షణీయం అని కూడా ఆయన తెలిపారు.
previous post