32.2 C
Hyderabad
March 28, 2024 23: 26 PM
Slider ప్రత్యేకం

గులాబీ తుపాన్…ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఆదిత్యనాధ్ పర్యటన..!

#adityanath

ఏపీ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాధ్.దాస్. .గులాబీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తుపాను ప్రభావం… ఉత్తరాంధ్ర పై తీవ్రంగా పడింది. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు సీఎస్… విజయనగరం జిల్లాలో పర్యటించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి..సీఎస్ కు స్వాగతం పలికారు.

ప్రభుత్వ ప్రధాన కార్యపునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా పలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ మేరకు జిల్లాలోని గజపతినగరంమండలం పురిటిపెంటలో, తుఫాను బాధితులకోసం బాలికల పాఠశాలలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పాల్తేరు కల్యాణమండపం సమీపంలో, చంపావతి నదిని ఆనుకొని, పురిపాకల్లో నివాసం ఉంటున్న 16 మందికి, ముందుజాగ్రత్త చర్యగా అక్కడినుంచి తరలించి, ఈ కేంద్రంలో పునరావాసం కల్పించారు.

బాధితులతో ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికీ కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయంపై ఆరా తీశారు. బాధితులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీవో బిహెచ్ భవానిశంకర్, తాసిల్దార్ అరుణకుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రైతు,కార్మిక చట్టాల సవరణ నిలిపి వేసే దాకా ఉద్యమం ఆగదు

Satyam NEWS

సెయింట్ ఆన్స్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక

Satyam NEWS

కేసీఆర్ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Bhavani

Leave a Comment