Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

ఏపి మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య (హత్య?)

Kodela-Siva-Prasada-Rao

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన నేటి తెల్లవారుజామున ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఇంట్లోని వారు గమనించి ఆయనను తక్షణమే బసర తారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన మరణించినట్లు చెబుతున్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఆయన గతంలో చైర్మన్ గా కూడా పని చేశారు. ఇటీవల కోడెల శివప్రసాదరావు పై అసెంబ్లీ నుంచి ఎత్తుకొచ్చిన ఫర్నీచర్ కు సంబంధించి కేసు నమోదుఅయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన కుమారుడి పై పలు రకాల కేసులు ఉన్నాయి. ఆయన కుమార్తె కూడా కోడెల అధికారంలో ఉన్న సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు కేసులు బుక్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆయన కొడుకుతో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆయన కొడుకు వేధింపులపై తరచూ తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడేవారు. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ కోడెల అర్ధంతరంగా మరణించారు. కోడెల మరణం వెనుక ఉన్న రహస్యం బయటకు రాకుండా ఆయన చైర్మన్ గా ఉన్న ఆసుపత్రికే తరలించారు. కోడెల శివప్రసాదరావుపై అసెంబ్లీ ఫర్నీచర్ కేసు నమోదు కావడంతో ఆయన గుంటూరులోని తన కుమార్తెకు చెందిన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఆయన హెల్త్ బులిటెన్ ను ఆయన కుటుంబ సభ్యులే విడుదల చేశారు తప్ప ప్రభుత్వ డాక్టర్ వద్దకు వెళ్లలేదు. ఇప్పుడు కూడా ఆయన ఆత్మహత్య చేసుకోగానే బసవతారకం ఆసుపత్రికి తీసుకువెళ్లారు తప్ప దగ్గరలోని నిమ్స్ కుగానీ ఇతర ప్రభుత్వ ఆసుపత్రికి గానీ లేదా ఏదైనా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి గానీ తీసుకువెళ్లలేదు. ఆయన కుమారుడు కోడెల ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎక్కడ ఉన్నారు అనే విషయంపై కేసు మొత్తం ఆధారపడి ఉంది.

Related posts

బడిబయట విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

Satyam NEWS

ప్రొబేషన్ డిక్లరేషన్ మహిళా సంర‌క్ష‌ణ పోలీసులకు త్వరలో శిక్షణ

Satyam NEWS

ఖాళీగా ఉన్న ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలి: డివైఎఫ్ఐ

Satyam NEWS

Leave a Comment