28.7 C
Hyderabad
April 20, 2024 06: 20 AM
Slider తూర్పుగోదావరి

ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి వినియోగదారుల మన్ననలు పొందుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నిర్వహణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కితాబు ఇచ్చిందని వివరించారు. అటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు.

నెట్, ఫోన్, కేబుల్ మూడింటిని ఒకే సారి వినియోగదారులకు అందిస్తున్న ఫైబర్ నెట్ కు గతంలో నెలకు 250 రూపాయలు వసూలు చేసేవారని దాని కొంతకాలం తరువాత 300 పెంచి జెమినీ ఛానెల్ లేకుండానే వినియోగదారులకు ప్రచారాలు ఇచ్చేవారని వివరించారు.

ఇప్పుడు తాజాగా 300 నుంచి 350 రూపాయలకు ధర పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇలా పెంచుకుంటూ పోయి వినియోగదారులను దూరం చేసి ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను పాతాళంలోకి తొక్కి కార్పొరేట్ వారికి సహకారం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందని ఆరోపించారు.

డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం అందించిన నిధులతో ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ పథకం కరోనా కష్టకాలంలో విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు చాలా ఉపయోగపడుతోందన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు దిక్కు కావడంతో రేట్లు తగ్గించాల్సిన పోయి పెంచడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు అమ్ముడుపోయి బహుళ ప్రయోజనాలు కలిగిన ఫైబర్ నెట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదన్నారు.

రాష్ట్రంలో ఉన్న పేదలకు తక్కువ రేట్ కే నెట్టు, చానల్స్, ల్యాండ్ ఫోన్ సేవలు అందిస్తున్నా ఫైబర్ గ్రిడ్ పథకం ద్వారా పన్నులు రూపేనా ప్రభుత్వానికి ఆదాయం అలాగే వేలాది ఆపరేటర్ల కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్న ఫైబర్ నెట్ ని బలోపేతం చేసి ప్రతి ఇంటికి అందించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఫైబర్ నెట్ రేట్లను వెంటనే విరమించుకోవాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ డిమాండ్ చేశారు.

Related posts

ప్రియాంక హంతకులను తక్షణమే ఉరి తీయాలి

Satyam NEWS

సమాజ శాంతి కోసం అశువులు బాసిన పోలీసులు…

Satyam NEWS

స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment