31.2 C
Hyderabad
June 20, 2024 22: 18 PM
Slider ఆంధ్రప్రదేశ్

సత్యంన్యూస్ ఎఫెక్ట్ :పాతకాపుల ఉద్వాసనకు కొత్త నిర్ణయం

sat567

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు శీర్షికతో సత్యం న్యూస్ పోస్టు చేసిన వార్తకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రిటైర్డ్ ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఇంటికి పంపేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యంత అవినీతిపరుడైన ఒక వ్యక్తిని సాగనంపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పెద్దమనిషి ఒక టీచర్. టీచర్లు సంబంధిత ఉద్యోగాలు తప్ప మంత్రుల వద్ద పని చేయరాదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి వద్ద చేరాడు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ అవినీతి పరుడికి ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది. పాఠకుల సౌకర్యం కోసం సత్యం న్యూస్ వెలువరించిన వార్త యథాతధంగా: గత ప్రభుత్వంలో పని చేసిన పిఎ, పిఎస్, ఓఎస్ డిలను మళ్లీ తీసుకోవద్దని సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లాం ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో పెద్ద ఎత్తున అవినీతి పరులు మంత్రుల కొలువుల్లో చేరిపోతున్నారు. మంత్రులు, మంత్రి హోదా ఉన్న ఇతర పోస్టుల వారికి పి ఎ, పి ఎస్, ఓ ఎస్ డిలను ప్రభుత్వం కేటాయిస్తుంది.

ఈ పోస్టులలో గత ప్రభుత్వంలో పని చేసిన వారి తీసుకోవద్దని ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలోనే  ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన వారు మధ్యవర్తులుగా ఉండి మంత్రితో పనులు చేయించి ఉభయ తారకంగా ఉండేలా చేసేవారు. అంటే ఆదాయం అందరికి సమానంగా వచ్చే లా చూసేవారు. సందట్లో సడేమియా లాగా వారు కూడా లక్షలు వెనకేసుకునేవారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉండరాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆ ఆదేశాలను చాలా మంది బేఖాతరు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పని చేసిన వారిని తీసుకోవద్దని చెప్పినా కూడా చాలా మంది కొత్త మంత్రులు అలాంటి వ్యక్తులవే ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రి కార్యాలయం చాలా వరకూ ఇలాంటి ఫైళ్లను ఆపిపెట్టింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి క్లియరెన్సు రాకపోవడంతో కొందరి నియామకాలు ఆగిపోయినా కూడా మరి కొందరివి మంత్రులు దగ్గరుండి క్లియర్ చేయించుకుంటున్నారు.

దాంతో మెహమాటానికి పోయి సి ఎం కార్యాలయం కూడా కొన్ని ఫైళ్లను క్లియర్ చేస్తున్నది. ఈ విధంగా క్లియరెన్సు తెచ్చుకోని వాళ్లు అనధికారికంగా మంత్రుల కార్యాలయాలలో పని చేస్తున్నారు. వారికి జీతం, భత్యం రాదు కానీ వారు మంత్రిని అంటిపెట్టుకుని అలానే తిరుగుతున్నారు. వాస్తవానికి వారికి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి ఆదాయం వారు తెచ్చుకోవడమే కాకుండా మంత్రికి కూడా ఇచ్చేంత సంపాదించే శక్తి వారికి ఉంటుంది.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పని చేసి రిటైర్ అయిన వాళ్లు తమకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో వర్తించదని చెబుతూ మళ్లీ ఉద్యోగాలలో చేరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టీచర్లు పి ఏ లుగా, పి ఎస్ లుగా ఓ ఎస్ డిలుగా పని చేయకూడదు. అలాంటిది టీచర్ ఒకాయన ఒక ఉప ముఖ్యమంత్రి దగ్గర చేరిపోయాడు. ప్రస్తుతం అనారోగ్యం కారణాలతో అతడు సెలవులో ఉన్నాడు.

ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ ఉప ముఖ్యమంత్రి దగ్గర చేరతాడు. అదే విధంగా మంత్రి పుల్లా రావు దగ్గర పని చేసిన ఒక వ్యక్తి పెద్ద స్థాయిలో పైరవీలు చేసుకుని నేడో రేపో ఒక మంత్రి వద్ద చేరిపోతాడని అంటున్నారు. కాల్వ శ్రీనివాసులు దగ్గర పని చేసిన మరొక వ్యక్తి ఒక ప్రధాన శాఖ కు చెందిన మంత్రి వద్ద పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని ఫైల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నిలుపుదల చేసింది.

ప్రభుత్వ విప్ ల దగ్గరా, చీప్ విప్ దగ్గర కూడా ఇలాంటి రిటైర్డ్ వ్యక్తులు అవకాశాల కోసం తిరుగుతున్నారు. అనధికారికంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో మరింత క్లారిటీ ఇచ్చి నిలుపుదల చేయకపోతే అనధికారికంగా పని చేస్తున్న వారు ఆ తర్వాతి కాలంలో నైనా రెగ్యులరైజ్ చేయించుకుంటారు. ఇది ఆపకపోతే అవినీతి యధా ప్రకారం కొనసాగుతూనే ఉంటుంది. -ఇప్పుడు వీరందరిని సాగనంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదీ సంగతి.

Related posts

రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్

Satyam NEWS

మోడీని కలిసిన గీతా గోపినాథ్

Sub Editor

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment