36.2 C
Hyderabad
April 16, 2024 20: 54 PM
Slider ప్రత్యేకం

రాజ్యాంగ ఉల్లంఘనపై జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట

cm jagan

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంపై విచారణ నిలుపుదల చేయడానికి నిరాకరించిన ఏపి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ‘‘ఆందోళన’’ కలిగిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. క్రిస్టమస్ సెలవుల అనంతరం ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని కూడా చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు ఏపి హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ ఒక నిర్ధారణకు రాగా దాన్ని నిలుపుదల చేయాలని జగన్ ప్రభుత్వం కోరింది. అయితే వెళితే సుప్రీంకోర్టుకు వెళ్లండి కానీ మేం మాత్రం కేసు విచారణ నిలుపుదల చేసేది లేదని జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది.

దాంతో ఈ అంశంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు విచారణపై స్టే విధించారు. అక్టోబర్ 1న హెబియస్ కార్పస్ పిటిషన్ల ను విచారిస్తున్న సమయంలో ఏపి హైకోర్టు రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు వ్యాఖ్యానించింది.

దీనిపై డిసెంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేస్తూ ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి సుప్రీంకోర్టు స్టే విధించింది.

Related posts

కలెక్టరెట్ లో క్లీన్ అండ్ గ్రీన్

Bhavani

ఆకట్టుకున్న పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

Satyam NEWS

ముస్లిం సోదరులకు ఉత్తమ్ బక్రీద్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment