23.7 C
Hyderabad
July 14, 2024 06: 14 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

190271-gh

ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఎగువ నుండి  వరద నీరు వస్తున్నందున  శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు నివాసం మెట్ల వద్దకు నీరు చేరుకొంది. శుక్రవారం సాయంత్రానికి మరింత వరద పెరిగింది. శనివారం నాడు చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న అరటితోటలోకి నీరు చేరుకొంది. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ  చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో కొన్నింటికి ఇప్పటికే  నీరు వచ్చింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం  నాడు చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో రికార్డు చేశారు. హై సెక్యూరిటీ జోన్ లో అనుమతి లేకుండా ఎలా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

Related posts

శ్రీలంకలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

అప్రమత్తంగా ఉండాలి

Bhavani

నెల్లూరులో విజయవంతంగా సాగుతున్న బాలోత్సవ్

Satyam NEWS

Leave a Comment