31.7 C
Hyderabad
April 19, 2024 00: 30 AM
Slider ముఖ్యంశాలు

ఏపిలో హిందూ దేవాలయాలను కొల్లగొడుతున్నారు

MilindParande_DrVijayalakshmiDeshmane_VHP

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలకు చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని విశ్వహిందూ పరిషత్ నాయకుడు మిలింద్ పరందె అన్నారు. ఇండోర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల ఆపరేషన్ కొనసాగుతున్నదని దీన్ని ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.

క్రైస్తవ మతాధిపతులు, ముస్లిం మతపెద్దలు కలిసి ఈ కుట్రకు తెరలేపారని హిందూ దేవాలయాలలో హిందువులు కాని వారి ప్రమేయం ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఇటువంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని వాటిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హిందూ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక భారీ ఆందోళన చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయ స్థానాలను కూడా ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. దేశంలో పౌరసత్వ చట్టంపై అనవసర రాద్ధాంతం జరుగుతున్నదని ఆయన అన్నారు.

ఇది కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాలలో అన్యాయానికి గురైన అల్పసంఖ్యాక మత వర్గాలకు (హిందువులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు తదితరులకు) కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని కల్పించేందుకు మాత్రమే ఈ చట్టం రూపొందించారని అంతే కానీ దేశంలోని పౌరులకు దీనితో సంబంధం లేదని ఆయన అన్నారు.

భారతీయ ముస్లింలకు పౌరసత్వ చట్టం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. నాలుగు రోజుల క్రితం,పాకిస్తాన్ లోని సిక్కుల పవిత్ర స్థలమైన శ్రీ గురు నానక్ దేవ్ జీ శ్రీ నాంక్నా సాహిబ్ గురుద్వార పై ముస్లింలు దాడులు చేశారని ఆయన అన్నారు. ఢిల్లీలో జామియా ఘటనలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో ముస్లింలు చేసిన హింసాత్మక ఆందోళన, అందులో జరిగిన ఆస్తి నష్టం వంటి ఘటనలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నదని మిలింద్ పరందె అన్నారు.

Related posts

పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం

Bhavani

ది స్టోరీ కంటిన్యూస్: రాజధాని బిల్లుకు మోకాలడ్డిన కౌన్సిల్

Satyam NEWS

వెట్టిచాకిరి కార్మిక కోడ్ లు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment