Slider ఆంధ్రప్రదేశ్

ఏపి హైకోర్టు ‘రివర్స్’ టెండర్ దెబ్బ

High_Court_of_Andhra

పొలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం విషయంలో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లొద్దంటూ ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం కాంట్రాక్ట్ నుంచి నవయుగని తప్పించే అంశంపైనా స్టే రావడంతో ఇక అదే కంపెనీ కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం నవయుగని తప్పించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. దీనిపైనే నవయుగ సంస్థ హైకోర్ట్ ని ఆశ్రయించింది. నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్న తమని తప్పించి రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెళ్తోందంటూ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన హైకోర్ట్ ఈమధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఒక విధంగా జగన్ సర్కార్ కు గట్టి ఎదురు  దెబ్బ లాంటిదే.

Related posts

కోట్లలో వ్యాపారం: ప్రభుత్వ ఆదాయానికి గండి: వినియోగదారుల లూటీ

Satyam NEWS

ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో గణనాధునికి పూజలు నిర్వహించిన కార్పొరేటర్లు

Satyam NEWS

రాజధాని విశాఖ లో ఇక విజయసాయి రెడ్డిదే హవా

Satyam NEWS

Leave a Comment