దేవదాయ శాఖ కమిషనర్ గా నియమితుడైన రామచంద్ర మోహన్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దేవదాయ శాఖ కమిషనర్ గా రామచంద్ర మోహన్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నియామకాన్ని సవాల్ చేస్తూ థర్డ్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్ర మోహన్ పోస్టింగ్ కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కానీ థర్డ్ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. సర్వీస్ మ్యాటర్స్ పరిశీలించే బెంచ్ కి పిటిషన్ ను పంపాలని న్యాయమూర్తి సూచించారు. హైకోర్టు పిటిషన్ పై ఆదేశాలు ఇవ్వటానికి నిరాకరించింది. రామచంద్ర మోహన్ నియామకంపై ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ రిలీవ్ అయ్యారు.
previous post
next post