28.7 C
Hyderabad
April 24, 2024 06: 29 AM
Slider ప్రత్యేకం

వైసీపీ రంగులపై మరో మారు జగన్ ప్రభుత్వానికి హైకోర్టు లో ఎదురు దెబ్బ

#aphighcourt

సుప్రీంకోర్టు చెప్పినా కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడం మానుకోలేదు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ కలర్స్ వేయడంపై జై భీమ్ యాక్సిస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరసా సురేష్ కుమార్, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటుచేసే భవనాలకు పార్టీ కలర్స్ వేయడంపై పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఈ నెల 16న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ప్రతివాదులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ కలర్స్ వేయడంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చెప్పినా అదే కలర్స్ ఎలా వేస్తారంటూ ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

Related posts

హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నిక కమిషనర్

Satyam NEWS

రేవంత్ క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు భానుప్రసాద్

Satyam NEWS

కరోనా నుంచి మెగాస్టార్ చిరంజీవికి రిలీఫ్

Satyam NEWS

Leave a Comment