28.7 C
Hyderabad
April 24, 2024 05: 58 AM
Slider ముఖ్యంశాలు

ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికలపై విచారణ వాయిదా

#APHighCourt

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ల విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే హైకోర్టుకు నివేదించింది.

గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.

గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అయితే, హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయండంతో.. ఎస్‌ఈసీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాలి.

Related posts

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

Satyam NEWS

ఈటమార్పురం శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కి పుష్పయాగం

Satyam NEWS

కలెక్టర్ గారూ.. రైతులపై కక్ష ఎందుకు..?: బీజేపీ నేత కాటిపల్లి ప్రశ్న

Satyam NEWS

Leave a Comment