తిరుమల తిరుపతి దేవస్థానం జంబో పాలక మండలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి 81 మందికి అందులో స్థానం కల్పించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఈ సభ్యులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తో బాటు మరో ఇద్దరు రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు.
దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను సస్పెండ్ చేసింది. నాలుగు వారాల పాటు ఈ సస్పెన్షన్ ఉంటుందని హైకోర్టు పేర్కొన్నది.