28.7 C
Hyderabad
April 24, 2024 03: 08 AM
Slider గుంటూరు

కౌలురైతులు సంఘటితం కావాలి

#kouluraitu

ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు అక్టోబర్ ఆఖరులో జరుగుతున్న సందర్భంగా సెప్టెంబరు ఆఖరు నాటికి గ్రామ, మండల మరియు జిల్లా మహాసభలను జరపాలని ఏపీ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు కామినేని రామారావు కోరారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో ఏపీ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం కామినేని రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులచే సి సి ఆర్ సి ల కోసం దరఖాస్తులు చేయించి ఈ క్రాఫ్ నమోదు చేయించాలని, రైతు భరోసా కేంద్రాల్లో సి సి ఆర్ సి ల లిస్టులను గ్రామస్థాయి కార్యకర్తలు తీసుకొని గ్రామ కమిటీలు వేయని గ్రామాల్లో గ్రామ కమిటీలను వేసి రుణాలు రాని వారందరితో బ్యాంకు రుణాల కోసం అధికారులతో రాయబారాలు నడపాలని కోరారు.

వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోర్ ఎస్ గ్రూపులను గుర్తించి వారిని కూడా బ్యాంకు రుణాల కోసం ఐక్యం చేయాలన్నారు. 2021వ సంవత్సరంలో పత్తి, మిర్చి పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులకు ఒక్కరికి కూడా జిల్లాలో నీటి సాగు కింద ఉన్నదని బీమా పరిహారాలు ప్రభుత్వం ప్రకటించలేదని, మిర్చి పంట జిల్లాలో 90 శాతానికి పైగా సాగునీటి క్రిందనే సాగు చేస్తారని ఈ క్రాప్ నమోదు చేయించుకున్న వారందరికీ భీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు అధికారులే కౌలు రైతులను గుర్తించి కౌలు రైతు కార్డు లను మంజూరు చేయాలని, కౌలు రైతుల పేర్లతోనే ఈ క్రాఫ్ నమోదు చేయాలని, కౌలు రైతులందరికీ పంటల భీమా చేయాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ముందస్తు కట్టించుకునే క్యాష్ కౌలు విధానాన్ని రద్దు చేయాలని, భూమిలేని ఓసి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని జూలై నెల 18వ తేదీన మంగళగిరిలోని సీసీఎల్ఏ ఆఫీసు వద్ద సామూహిక రాయబారమునకు పల్నాడు జిల్లాలోని కౌలు రైతులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల మహేష్,T. హనుమంతరావు, పిచ్చా రావు, కొండ్రు ఆంజనేయులు, పొట్లూరు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోడు భూములకు పట్టాలు పంచిపెట్టాలి

Satyam NEWS

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 49 మంది కూలీల దుర్మరణం

Sub Editor

ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వమే సుప్రీం

Bhavani

Leave a Comment