సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్‌కుమార్ గుప్తాను ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఆయన ఉన్నారు.
గుప్తా ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్నారు. హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ప్రభుత్వ హాయంలో ఒక ప్రయివేటు ఆర్మీలాగా తయారైన పోలీస్ శాఖ ను ద్వారకా తిరుమలరావు ఆసాంతం మార్చారు. పోలీసు శాఖ ప్రజలకు సేవ చేసే విధంగా ఆయన చెరగని ముద్రవేశారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేశారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారు.
కొత్త డీజీపీ నియమితులైన హరీష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ ఏపీ డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ కొనసాగిస్తాం అని గుప్తా తెలిపారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కారు ధ్వంసం