32.2 C
Hyderabad
June 4, 2023 20: 13 PM
Slider ఆంధ్రప్రదేశ్

యురేనియం వ్యర్ధాలపై నిపుణుల కమిటీ

ucil

కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యర్థాలవల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. దీనిపై ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిపుణుల కమిటీని నియమించింది. యురేనియం కార్పొరేషన్‌ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా? లేదా? అన్న విషయంపై ఈ కమిటీ  అధ్యయనం చేయనున్నది. నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్‌జీఆర్‌ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు,  ఏపీ మైన్స్‌, జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నియమించనున్నది. ఈ నియామకాలు మూడురోజుల్లోగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పూర్తి చేస్తుంది. ఆ తర్వాత10 రోజుల్లోగా కమిటీ నివేదిక అందించాల్సి ఉంటుంది.

Related posts

వ్యాయామం

Satyam NEWS

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పై కసరత్తు

Sub Editor

కరెంటు తీగలు తగిలి 9 మంది కూలీల మృతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!