28.2 C
Hyderabad
April 30, 2025 05: 25 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అందరికీ మేలుకలిగేలా నదుల అనుసంధానం

ys kcr

వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.  గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై ఇద్దరు ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చలు జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా వుండాలి? అనే విషయాలు వీరు చర్చించారు. రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకరంగా వుండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం వుండాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.   దీనికోసం  రెండు రాష్ట్రాలూ ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్, పోలీస్  ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై కూడా ఇద్దరు సిఎంలు చర్చించారు.   తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని తెలంగాణ సిఎం కేసిఆర్ ఏపి ముఖ్యమంత్రిని కోరారు.   దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు.  పోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.   ఈ అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకూ సంబంధించిన ఇతర విషయాలను కూడా  ఈ సమావేశంలో చర్చించారు

Related posts

ఉక్రెయిన్‌ ఎదురు దాడి: 50 మంది రష్యన్ సైనికులు మృతి

mamatha

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరచిన శ్రీ గురు తేగ్ బహదూర్

Satyam NEWS

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత

mamatha

Leave a Comment

error: Content is protected !!