33.2 C
Hyderabad
April 26, 2024 01: 51 AM
Slider నల్గొండ

అపరంజి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

#aparanjeetrust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అపరంజి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. ట్రస్టు ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ 200 మందికి ఉచితంగా ఆహారం అందచేయడం మంచి కార్యక్రమమని తెలిపారు.

దిక్కులేని వారికి, యాచకులకి, వృద్దులకు, పలు గ్రామాల నుండి పనులు నిమిత్తం హుజూర్ నగర్ పట్టణానికి హాస్పిటల్స్ కి వచ్చే పేషేంట్లకి, పేదవారికి భోజనం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల ప్రశంసలు, అధికారుల ప్రశంసలు అందుకొంటున్న అపరంజి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం తో 100 రోజులు పూర్తి చేసుకోవటం అభినందనీయం అన్నారు. హుజూర్ నగర్ ఆర్డీవో వెంకారెడ్డి పేదవారికి భోజనం వడ్డించి తన సంతృప్తిని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ‌మన్నూరి కాశయ్య మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయటానికి, వేసవి కాలం వచ్చిందంటే ప్రతి రోజు 1500 మందికి ఫ్రీ మజ్జిగ కార్యక్రమం,  దిక్కులేని వారికి,అనాథలకి బట్టల పంపిణి,  తల్లి తండ్రి చనిపోయిన పిల్లలకి బట్టలు, పుస్తకాలు కొనివ్వడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటానికి  ట్రస్ట్ కి  సహకరిస్తూన్న దాతలందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ ‌మన్నూరి గురుమాల, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మార్చి 31 నుండి ఎత్తివేత

Sub Editor 2

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో కార్తీకమాస పూజలు

Bhavani

కరోనా కారణంగా కావలి లో సంపూర్ణ లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment