Slider కృష్ణ

రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం విగ్రహాలు

#APJAbdulKalam

వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ పదేళ్లుగా దేశ వ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ‘గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్’ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను సీఎం చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం అని, రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, సంస్థ సభ్యులు శివ, భాస్కర్, శ్రీను, రంజిత్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

mamatha

హిట్ లిస్ట్ సినిమా మే 31న వరల్డ్ వైడ్ తెలుగు గ్రాండ్ రిలీజ్

Satyam NEWS

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Satyam NEWS
error: Content is protected !!