39.2 C
Hyderabad
April 25, 2024 18: 04 PM
Slider ముఖ్యంశాలు

కాంట్రవర్సీ: అన్ని తీర్పులపైనా పున:సమీక్ష కోరే యోచన

#Y S Jaganmohan Reddy CM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తిన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకూ ఎన్నికల కమిషనర్ గా ఉన్న డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పదవి కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చిన విషయం తెలిసిందే.

వెనువెంటనే రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దాంతో రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నది.

తీర్పు కాపీలు రాగానే సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేస్తారు. ఏపీ హై కోర్టులో వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో  సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈసీ విషయంలో హై కోర్టు తీర్పుని ముందుగానే అంచనా వేశామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

అన్ని అంశాలపై పునరాలోచన చేసి సుప్రీంకోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా మహేశ్వరి వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని తీర్పులపైనా పున: సమీక్ష జరపాలని కోరితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే 60కి పైగా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో అన్ని కేసులపైనా పున:సమీక్ష కోరాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది.

Related posts

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

Satyam NEWS

కుప్పం ప్రాంతీయ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభం

Satyam NEWS

చేయి కోల్పోయిన రైతుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS

Leave a Comment