దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఈ విషయంలో ముందున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, హరీశ్ శంకర్‌లు ఇప్పటికే స్పందించగా, తాజాగా నటుడు మంచు మనోజ్ స్పందించాడు.
నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని అన్నాడు. ఎన్‌కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నాడు. నలుగురు చచ్చారనే వార్త లో ఇంత కిక్కు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
‘‘ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల దిశ ఇంటికి వెళ్లిన మనోజ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసై ఉండాలి అంటూ నాని ట్విట్ చేశాడు.