35.2 C
Hyderabad
April 20, 2024 15: 59 PM
Slider మహబూబ్ నగర్

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నమోదు చేసుకోండి

#DEO Nagarkurnool

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపిక నేపథ్యంలో భాగంగా  అంకితభావంతో, అంకుఠిత దీక్షతో విద్యా విధానాన్ని ప్రభావితం చేయడంతో పాటు విద్యార్థులకు ఉజ్వలమైన  భవిష్యత్తు ప్రసాదించిన అపూర్వమైన ఉపాధ్యాయుల పనితీరును గుర్తించి గౌరవించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రవేశపెట్టిందని డీఈవో గోవిందరాజులు తెలిపారు.

ఈ అవార్డు కొరకు రాష్ట్ర ప్రభుత్వ  ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వ,  జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్ లలో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్,PGTs,TGTs మొదలగువారు ఈనెల ఆగస్టు 10వ తేదీ లోగా తాము సాధించిన విజయాలతో కూడిన మదింపు పత్రాలను(binding books) నాలుగు సెట్లును జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు.

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుటకు తప్పనిసరిగా గతంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది ఉండాలన్నారు.

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు కనీస సర్వీసు 15 సంవత్సరాలు మిగతా ఉపాధ్యాయులు కనీస సర్వీస్ 10 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు అవకాశం లేదని, మరిన్ని ఇతర సమగ్ర సమాచార వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి (9989921105)ని సంప్రదించాలని డిఇఓ మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు.

Related posts

త్రాగునీటి స‌మ‌స్య‌కు రూ.1.49 కోట్ల‌తో క్రాష్ ప్రోగ్రాం అమ‌లు

Satyam NEWS

మాస్కులు ధరిద్దాం.. కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

దేశాన్ని ఏకం చేసిన ప్రధాని నరేంద్రమోడీ పిలుపు

Satyam NEWS

Leave a Comment