32.2 C
Hyderabad
March 28, 2024 22: 29 PM
Slider ముఖ్యంశాలు

ఇన్స్పైర్ అవార్డు విద్యార్థుల వివరాలను నమోదు చేయండి

#deo

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం 2017-18 విద్యా సంవత్సరం నుండి 2021- 22 విద్యా సంవత్సరం వరకు నాగర్ కర్నూలు జిల్లాలో గతంలో ఇన్స్పైర్ అవార్డ్స్ కు ఎంపికైన విద్యార్థులలో యువ శాస్త్రవేత్తలు గా కృత్రిమ మేధస్సు నిర్మాణానికి క్రింద తెలిపిన లింకులో ఈ నెల 31వ తేదీ లోగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

www.inspiremanak.buildingaireadiness.in లింక్ లో నమోదు చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని, ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సైన్స్ ఉపాధ్యాయులు లింకు లో నమోదు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిఇఓ సూచించారు.

గతంలో ఉన్నత పాఠశాలలో చదువుతూ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికై విద్యార్థుల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంటే వారి పేర్లను నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి(9989921105) ని సంప్రదించాలని కోరారు.

Related posts

లహరి-అమ్మఒడి అనుభూతి

Murali Krishna

జూలై 4 నుంచి ఈఏపి సెట్

Sub Editor 2

దేవనార్ అంద పాఠశాలకు చైతన్య ఫౌండేషన్ వితరణ

Satyam NEWS

Leave a Comment