38.2 C
Hyderabad
April 25, 2024 12: 18 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లకు ఉపకులపతి అభినందనలు

#vikram

ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లు  విశ్వవిద్యాలయం, జిల్లా  పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి అన్నారు. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వవిద్యాలయం లో నవంబర్ 20 వ తారీఖు నుంచి 29 వ తారీఖు దాకా జరిగిన  ప్రీ రిపబ్లిక్ డే  క్యాంప్ లో పాల్గొన్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ లు ఎ.ఈశ్వర్, ప్రియా ను ఆచార్య జి యం సుందరవల్లి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి  మాట్లాడుతూ  ఎన్ ఎస్ ఎస్ చేపడుతున్న సేవా కార్యక్రామాలు భేషుగ్గా ఉన్నాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్  ఎస్ ఎస్ వంటి వాటి లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం తో పాటు ఆరోగ్య పరంగా దారుడ్యం గా ఉండటానికి దోహదపడతాయని అన్నారు.

ఎన్ ఎస్ ఎస్ మరియు క్రీడల ద్వారా మాత్రమే రాష్ట్ర, దేశ స్థాయి లో ప్రతిభ చూపించడానికి అవకాశం ఉందని అన్నారు. విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ అందరూ సమాజా సేవ అలాగే సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. పి రామచంద్ర రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ఆచార్య సుజా ఎస్ నాయర్ పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆంద్రప్రదేశ్ పెద్దలు

Satyam NEWS

ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

కుట్టు మెషిన్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Satyam NEWS

Leave a Comment