పారా స్పోర్ట్స్ విజేతలకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ సెకండ్ ఎడిషన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఏపీ క్రీడాకారులు పతకాలు సాధించారు. రొంగలి శివ, షేక్ బాబు, వి.భవానీ,అంబటి స్వరాజ్ పోటీల్లో పతకాలు సాధించి ఏపీ ఖ్యాతిని పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పారా గేమ్స్‌తో పాటు Deaf, Blind స్పోర్ట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు శ్రద్ధ వహిస్తుంది. ఇప్పటికే రాష్ర్టంలో దివ్యాంగుల కోసం నిర్మించే స్పోర్ట్స్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ₹200 కేటాయించిందని మంత్రి తెలిపారు.
previous post