20.7 C
Hyderabad
December 10, 2024 01: 22 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రజా రవాణా శాఖ కు ఆర్టీసీ సిబ్బంది

Perni-Nani

ఏపి ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించిన కీలక నిర్ణయాన్నిప్రకటించబోతోంది. మాజీ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై  90 రోజులపాటు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని పలు అంశాలపై ముఖ్యమంత్రి నిపుణుల కమిటీతో చర్చించారు. రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని, ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రవాణాశాఖ కమీషనర్‌ తిరుమల కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియా ప్రతినిధులకు వివరించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపారని మంత్రి చెప్పారు.  కొత్తగా ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేసి దానిలోకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ తీసుకొస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపారని పేర్నినాని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా, అనేక రకాల ఇబ్బందులుపడుతున్నారని, వీరందరినీ  ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం ఉందని, ఆ భారాన్నిరాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయాలన్న నిర్ణయం ద్వారా లాభాల బాటలో పరిగెత్తించడమే కాకుండా…. దేశంలో నంబర్‌ వన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌  పోర్ట్‌ గా నిలవాలంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారని పేర్నినాని చెప్పారు. చాలా అంశాల మీద అధ్యయనం జరిగిన తర్వాతే సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తీసుకున్నారని, బస్సు అంటే రాష్ట్ర బస్సే ఎక్కాలనేంత ఆధునికంగా తయారు చేయాలని  సీఎం సూచించారని మంత్రి తెలిపారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా ప్రవేశపెడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

Related posts

జూనియర్ ఎన్టీఆర్ పై నెటిజన్ల ట్రోలింగ్

Satyam NEWS

అడవుల పరిరక్షణ మనందరి బాధ్యత

Satyam NEWS

సమాచార హక్కు చట్టం కిందికి ప్రధాన న్యాయమూర్తి

Satyam NEWS

Leave a Comment