33.2 C
Hyderabad
April 26, 2024 00: 46 AM
Slider మహబూబ్ నగర్

మత్స్య కారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

#YasminBashaIAS

మత్స్య కారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలోని వల్లపురెడ్డి రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎగుమతి ఆధారిత చేప జాతుల వైవిద్యం మరియు ఆక్వా సాగు లో సాంకేతిక పరిజ్ఞానం  స్థాయి పెంపు పైన  ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్లో జిల్లా కలెక్టర్ తో పాటు ఎంపీ ఈ డి ఎ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్, చైర్మన్ శ్రీనివాస్ తో జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య సంపద పెంపొందించడానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని ప్రతి చెరువు కుంటలలో చేప పిల్లల పెంపకానికి చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో రోహ, బ్రీగాల అనే చేప పిల్లలు 2 లక్షల5 వేలు పెంచడం జరిగింది అన్నారు. మారుతున్న సాంకేతిక పద్ధతులను బట్టి మత్స్య,అక్వా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

రైతులు ఆర్థికంగా ఎదగడానికి నూతన సాంకేతిక పద్ధతి ద్వారా మత్స్య అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు రఘువీరా రెడ్డి మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎస్ ఏ రెహమాన్, రూపేందర్ సింగ్, భరత్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

నిర్బంధంలో ప్రజాభిప్రాయ సేకరణ తగదు: అఖిలపక్షం

Satyam NEWS

దేశం మెచ్చిన నాయకుడు కెసిఆర్: శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు

Satyam NEWS

Leave a Comment