కృష్ణానది వరదలకు నియోజకవర్గంలో 4,055 ఎకరాల్లో ఆక్వా చెరువులకు నష్టం కలిగిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలో చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆక్వా రైతులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు నియోజకవర్గంలో 4,055.19ఎకరాల్లో ఆక్వా చెరువులకు నష్టం కలిగిందన్నారు. 126 బోట్లు, 520 వలలు దెబ్బతిన్నాయన్నారు. నాగాయలంక మండలంలో 1,445 ఎకరాల చెరువులు, 51 బోట్లు, 408 వలలకు నష్టం కలిగిందన్నారు. అవనిగడ్డ మండలంలో 37.68 ఎకరాల్లో చెరువులు, 74 బోట్లు, 111వలలు, కోడూరు మండలంలో 22.94 ఎకరాల్లో చెరువులు, ఒక బోటు, ఒక వల, రెండు కేజెస్, మోపిదేవి మండలంలో 271.41 ఎకరాల్లో చెరువులు, చల్లపల్లి మండలంలో 7.1 ఎకరాల్లో చెరువులు, ఒక హెచరీకి నష్టం జరిగిందని వివరించారు. నియోజకవర్గంలో ఆక్వా రంగానికి జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
previous post