ఏపీ సీఎం జగన్ ని దూషించిన కేసులో ఏ ఆర్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టు ముందు హాజరు పరిచారు. దాంతో అతనికి 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు జగన్ పై విమర్శలు చేశాడు.
ఆ ఏఆర్ కానిస్టేబుల్ తన మాటలు రికార్డు చేసి పోలీసు అధికారులకు పంపాడు. జీతాల విషయంలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారని ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.