37.2 C
Hyderabad
March 29, 2024 20: 36 PM
Slider సినిమా

13 న వస్తున్న విభిన్న కథా చిత్రం “అరకులో విరాగో”

#arakulo virago

ఓ మహిళా యోధురాలి ప్రతీకార గాథ !!!

“విరాగో” అంటే సంస్కృతంలో “మహిళా యోధురాలు” అని అర్ధం.  అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి… తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపధ్యంలో రూపొందిన చిత్రానికి “అరకులో విరాగో” అనే పేరు పెట్టారు దర్శకనిర్మాతలు. దర్శకుడు ‘గిరి చిన్నా’కి, నిర్మాత ‘శ్రీమతి తోట సువర్ణ’కి ఇది ఆరంగేట్ర చిత్రం కావడం గమనార్హం.

తోట ప్రొడక్షన్స్ పతాకంపై గిరి చిన్నా దర్శకత్వంలో శ్రీమతి తోట సువర్ణ నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రంలో రవీన్ ప్రగడ-పూజా చౌరాసియా హీరోహీరోయిన్లు. డి.ఎస్.రావు ప్రతినాయకుడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత శ్రీమతి తోట సువర్ణ మాట్లాడుతూ… “గిరి చిన్నా చెప్పిన కథ ఎంతగానో నచ్చి… అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… నిర్మాతగా నేను కూడా అరంగేట్రం చేస్తున్నాను. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసుల్ని ఆశ్రయించిన తనకు అక్కడ కూడా ఎదురైన ఆరాచకంపై ఓ ధీర వనిత తీర్చుకునే ప్రతీకారమే “అరకులో విరాగో”. హీరో-హీరోయిన్లుగా పరిచయమవుతున్న రవీన్ ప్రగడ-పూజా చౌరాసియా… ఇద్దరూ చక్కని ప్రతిభ కనబరిచారు. డి.ఎస్.రావు విలన్ గా అద్భుతంగా నటించారు. ఈనెల 13న విడుదల చేస్తున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కూర్పు: ఈశ్వర్ కురిటి, కూర్పు: పార్థు గురునాయక్, పాటలు: ఇమ్రాన్ శాస్త్రి, సంగీతం: త్రినాధ్ మంతెన, ఛాయాగ్రహణం: సంతోష్ నాని, నిర్మాత: శ్రీమతి తోట సువర్ణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గిరి చిన్నా!!

Related posts

ఈ ప్లవం మహమ్మారిపై తిరుగుబాటు విప్లవమే..

Satyam NEWS

అక్కినేని సమంత ప్రాణ స్నేహితురాలికి కరోనా

Satyam NEWS

కుప్పం నుండి సైకిల్ పై రాజమండ్రికి

Bhavani

Leave a Comment