లౌకిక దేశంగా పేరుగాంచిన భారత దేశంలో ముస్లింలు భయపడుతూ తమ జీవనం కొనసాగిస్తున్నారా? భారత్ లో వారి జీవితాలకు భద్రత లేదా? ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పేర్కొంది. దేశంలో ఉన్న ఇతర మైనారిటీలైన పార్శీలు, బౌద్ధులు, జైనులు మొదలైన వారంతా ఎంతో భద్రతతో ఉన్నారని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్ అన్నారు. అకడమిక్స్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో గోపాల్ ప్రసంగించారు. ఇతర మైనారిటీలు సురక్షితంగా ఉన్నప్పుడు ముస్లింలు ఎందుకు ఉండలేరని ఆయన ప్రశ్నించారు. దేశంలో 16 కోట్లమందికిపైగా ముస్లింలు ఉన్నారని, వారు భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన చెప్పారు. పార్శీలు 50 వేలమంది మాత్రమే ఉన్నారని, జైనులు 45 లక్షల మంది ఉన్నారని, బౌద్ధులు 80 లక్షలమంది ఉన్నారని, యూదులు కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారని ఆయన చెప్పారు. వారెవరూ భయపడటం లేదని, ఇక్కడ సురక్షితంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.
previous post